చైనాలో విజృంభిస్తున్న మహమ్మారి వైరస్.. మళ్లీ లాక్‌డౌన్
- వైరస్‌ను కట్టడి చేశామని భావిస్తున్న వేళ కేసులు
- రాజధాని బీజింగ్‌లో వందల సంఖ్యలో కరోనా బాధితులు
- బీజింగ్ నుంచి 150 కిలోమీటర్ల వరకు పూర్తిగా షట్‌డౌన్
నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలు వంటి వాటికి ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. వైద్య చికిత్సల విషయంలో మాత్రమే వ్యక్తిగత ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. మరోవైపు, వుహాన్ ఉండే హుబెయ్ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.