కరోనా విజృంభణ... కేరళ నుంచి నర్సులను ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న హైదరాబాద్ ఆసుపత్రులు!
- తెలంగాణలో కరోనా కల్లోలం
- విపరీతంగా పెరుగుతున్న కేసుల సంఖ్య
- పేషెంట్లతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు
దీనిపై తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ రుడావత్ మాట్లాడుతూ, తాత్కాలిక ప్రాతిపదికన అయినా నియమించుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రులు, ఒక్కో నర్సుకు రూ.50 వేల వరకు జీతం ఆఫర్ చేస్తున్నాయని వెల్లడించారు. సాధారణంగా నర్సులకు ఇచ్చే జీతానికి ఇది మూడు రెట్లు ఎక్కువని అన్నారు. నర్సులు కావాలంటూ తమకు రోజుకు 10 నుంచి 15 కాల్స్ వరకు వస్తున్నాయని తెలిపారు.