ఆమె ఆత్మహత్య చేసుకోబోతోంది.. వెళ్లి కాపాడాలంటూ సమాచారమిచ్చిన యువకుడు.. అప్పటికే ఉరేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థిని!
- తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో ఘటన
- తల్లిదండ్రులు, సోదరుడితో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఉరేసుకున్న యువతి
- చికిత్స పొందుతూ మృతి
ఆ తర్వాత కాసేపటికి శ్యామల స్నేహితురాలికి ఫోన్ చేసిన ఓ యువకుడు.. ఆమె ఆత్మహత్యకు యత్నిస్తోందని, వెళ్లి కాపాడాలని కోరాడు. దీంతో విద్యార్థులు పరుగు పరుగున హాస్టల్‌కు చేరుకున్నారు. అయితే, అప్పటికే శ్యామల ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. తలుపులు పగలగొట్టి ఆమెను కిందికి దించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి రుయాకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. శ్యామల ఆత్మహత్య చేసుకోబోతోందని ఫోన్ చేసిన చెప్పిన యువకుడు గుంటూరులో ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు అతడికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.