Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీ స్ఫూర్తి మమ్మల్ని గర్వించేలా చేసింది: పీటీ ఉషకు యువరాజ్ శుభాకాంక్షలు

Yuvraj sing greets PT Usha on her birthday
  • నేడు పీటీ ఉష జన్మదినం
  • 56వ వసంతంలోకి అడుగుపెట్టిన పరుగుల రాణి
  • మీ విజయాలను చూస్తూ పెరిగామన్న యువీ
పరుగుల రాణి పీటీ ఉష పుట్టినరోజు నేడు. ఈరోజుతో ఆమె 56వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్బంగా ఆమెకు పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. టీమిండియా మాజీ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెపుతూ... ఆమెను ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన మెసేజ్ పోస్ట్ చేశాడు.

ట్రాక్ అండ్ ఫీల్డ్ లో పరుగుల రాణిగా ప్రశంసలు అందుకున్న ఉషకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని యువీ ట్వీట్ చేశాడు. మీ అద్బుతమైన విజయాలు, పట్టుదలను చూస్తూ పెరిగామని... మీ స్ఫూర్తి మమ్మల్ని భారతీయులుగా గర్వించేలా చేసిందని చెప్పాడు. యువతను ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న కృషి చాలా గొప్పదని కితాబిచ్చాడు. ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించాడు.
Yuvraj Singh
PT Usha
Birthday

More Telugu News