కోడిగుడ్డుపై రెండు గుడ్లను నిలబెట్టి రికార్డు నెలకొల్పిన కుర్రాడు.. వీడియో ఇదిగో

  • గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన యెమెన్‌కు చెందిన‌ ముక్బుల్‌ (21)
  • మలేషియాలోని కౌలాలంపూర్‌లో ప్రదర్శన
  • చిన్నప్పటి నుంచి వస్తువులను పేర్చే అలవాటుతో ప్రతిభ
కోడిగుడ్డును నిటారుగా నిలబెట్టడం సాధ్యమేనా? చాలా కష్టపడితే సాధ్యం కావచ్చు. అయితే, దానిపై మరో కోడిగుడ్డును.. దానిపై మూడో కోడిగుడ్డును నిలబెట్టగలమా? అసాధ్యమే.. కానీ, యెమెన్‌కు చెందిన మహ్మద్‌ ముక్బుల్‌ (21) మాత్రం ఇదే పని చేసి గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు.

మలేషియాలోని కౌలాలంపూర్‌లో గిన్నిస్‌ బుక్ నిర్వాహకుల ఆధ్వర్యంలో అతడు ఈ రికార్డు సాధించాడు. కోడి గుడ్లు కిందపడకుండా అతడు ఒకదానిపై ఒకటి పెట్టిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మూడు కోడిగుడ్లను ఒకదానిపై ఒకటి పేర్చడం చూసిన గిన్నిస్‌ బుక్ ప్రతినిధులు అతడికి సర్టిఫికెట్ ఇచ్చారు.

ముక్బుల్‌కి వస్తువులను ఇలా ఒకదానిపై ఒకటి పేర్చడం చిన్నప్పటి నుంచే అలవాటు. చాలా రకాల వస్తువులను ఒకదానిపై మరొకదాన్ని నిలబెడతాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను అతడు తన సోషల్ ‌మీడియా ఖాతాల్లో పోస్టు చేసేవాడు.
           



Viral Videos
guinness records

More Telugu News