మహేశ్ సినిమాలో కీలక పాత్రలో మలయాళ భామ

  • ఎన్టీఆర్, రజనీకాంత్ సరసన నటించిన నివేద 
  • ప్రస్తుతం పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'లో హీరోయిన్
  • మహేశ్ 'సర్కారు వారి పాట'లో కీలక పాత్ర  
సంప్రదాయ బద్ధంగా కనిపించే మలయాళ భామ నివేద థామస్ గతంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ టాలీవుడ్ లో ఆమెకు సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి. తెలుగులో ఎన్టీఆర్ (జైలవకుశ), తమిళంలో రజనీకాంత్ (దర్బార్) వంటి స్టార్లతో కూడా నివేద నటించింది.

ప్రస్తుతం 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ సరసన కూడా నటిస్తోంది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ నుంచి ఈ ముద్దుగుమ్మకు ఓ భారీ ఆఫర్ వచ్చింది. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో ఓ కీలక పాత్రకు ఆమెను తీసుకున్నారన్నది తాజా వార్త. దీనిపై అధికార ప్రకటన రావలసివుంది.

ఇక ఈ చిత్రం అప్ డేట్స్ విషయానికి వస్తే, ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థలోని లోసుగులపై దర్శకుడు పరశురాం దీనిని తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చిత్రంలో బ్యాంక్ లో చిత్రీకరించే సన్నివేశాలు చాలా ఉండడంతో హైదరాబాదులో ప్రత్యేకంగా ఓ అధునాతన బ్యాంక్ సెట్ ను వేస్తున్నట్టు తెలుస్తోంది.

Nivetha Thomas
Mahesh Babu
Pawan Kalyan

More Telugu News