అంతలోనే తుక్కుగా మారిన రెండు కోట్ల రూపాయల కొత్త కారు!
- రూ.2 కోట్లు పెట్టి కొన్న కారు 20 నిమిషాలకే తుక్కు
- వెనక నుంచి వచ్చి బలంగా ఢీకొట్టిన మరో కారు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
అప్పుడే జరగరానిది జరిగింది. అతడు కిందికి దిగిన మరుక్షణం వెనక నుంచి వచ్చిన మరో కారు ఈ లంబోర్గినిని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు వెనకభాగం పూర్తిగా దెబ్బతింది. కారు కొన్న 20 నిమిషాల్లోనే కళ్లెదుటగా తుక్కుగా మారడంతో అతను అప్పటి వరకు అనుభవించిన ఆనందం మొత్తం ఆవిరైంది. ప్రమాదానికి గురైన కారు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన పోలీసులు ‘ఏడ్చిన కారు ఏదైనా ఉందంటే అది ఇదే’ అని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. కారు యజమాని దురదృష్టానికి జాలిపడుతూ ఊరడించే కామెంట్లు పెడుతున్నారు.