'ఆహా'లో హోస్ట్ గా చేయనున్న తమన్నా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఆహా'లో హోస్ట్ గా చేయనున్న తమన్నా!

Thamanna gives nod for hosting a talkshow
  • డిజిటల్ ప్రపంచంలోకి వస్తున్న తమన్నా 
  • అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా'తో డీల్
  • టాక్ షోకి హోస్టుగా మిల్కీ బ్యూటీ  
తాము ఎన్నాళ్లు లైమ్ లైట్ లో వుంటామన్నది, ఎన్నాళ్లు తమకు ఆఫర్లు వస్తాయన్నది హీరోయిన్లకు బాగానే తెలుస్తుంది. అందుకే, అందుకు తగ్గట్టుగానే ప్రతి క్షణాన్నీ సద్వినియోగం చేసుకుంటారు. ఓపక్క సినిమాలు చేస్తూ... మరోపక్క కమర్షియల్స్ చేస్తూ ఎడాపెడా సంపాదిస్తూ, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు. కొత్తనీరు రాగానే పాతనీరు పోతుందన్న చందంగా కొత్త హీరోయిన్లు వస్తుంటే పాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతుంటాయి.

దీనిని గుర్తెరిగే ఆయా తారలు అటువంటి పరిస్థితిలో ఎటువంటి అవకాశాలు వచ్చినా ఒప్పేసుకుంటూ వుంటారు. ప్రస్తుతం కథానాయిక తమన్నా కూడా అదే రీతిలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే తాజాగా డిజిటల్ ప్రపంచంలోకి కూడా అడుగుపెడుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నేతృత్వంలోని 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి తమన్నాకి ఓ ఆఫర్ వచ్చిందట. అదేమిటంటే, ఓ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరించే ఛాన్స్. డీల్ బాగుండడంతో తమన్నా వెంటనే దీనికి ఓకే చెప్పేసిందని అంటున్నారు.    
Tamannaah
Allu Aravind
OTT
Ahaa

More Telugu News