మహిళ కడుపున బాలభీముడు.. 5.5 కిలోల బరువుతో జన్మించిన చిన్నారి!
- నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిలో ఘటన
- ఇంతటి బరువుతో పిల్లలు జన్మించడం అరుదు
- తల్లీబిడ్డలు క్షేమమన్న వైద్యులు
తెలంగాణలోని నిర్మల్ ప్రసూతి ఆసుపత్రిలో జరిగిందీ ఘటన. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడుకు చెందిన నేహ ఇటీవల పురుటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. సాధారణ కాన్పుకు ఇబ్బంది పడుతుండడంతో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి పండంటి బాబును బయటకు తీశారు. స్నేహకు 5.5 కిలోల బరువున్న బాబు జన్మించాడని వైద్యులు తెలిపారు. ఇంతటి బరువుతో శిశువులు జన్మించడం అరుదని పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు.