తెలుగు టీవీ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్... షూటింగ్ నిలిపివేత
- తిరుపతి నుంచి నేరుగా షూటింగ్ కు వచ్చిన నటుడు
- యూనిట్ సభ్యులందరికీ క్వారంటైన్
- నటుడు ఎవర్ని కలిశాడన్న దానిపై పోలీసుల ఆరా
కరోనా సోకిన నటుడు తిరుపతి నుంచి నేరుగా షూటింగ్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ నటుడు ఎవరెవరిని కలిశాడన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సుదీర్ఘ లాక్ డౌన్ తర్వాత షూటింగులు ప్రారంభమయ్యాయన్న ఆనందంలో ఉన్న బుల్లితెర నటీనటులు ఈ పరిణామంతో నిరుత్సాహానికి గురయ్యారు. ఈ ఘటన మిగతా టీవీ సీరియళ్లపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.