పట్టిసీమ పంపులు పీకుతామన్నారు.. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది: దేవినేని ఉమా
- పట్టిసీమను వట్టిసీమ అని జగన్ అన్నారు
- గోదావరి జలాలను తీసుకుపోతున్నారంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు
- ఆరో ఏడాది కూడా గోదావరి జలాలు వచ్చేశాయి
అధికారంలోకి వస్తే పట్టిసీమ పంపులు పీకుతామంటూ గతంలో జగన్ అన్నారని... మీరు అధికారంలోకి వచ్చే ఏడాది దాటిందని, నాటి మీ మాటలకు ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. తమ నాయకుడు చంద్రబాబు ముందు చూపుతో కట్టిన పట్టిసీమ ద్వారా ఆరో సంవత్సరం కూడా కృష్ణా డెల్టాను కాపాడేందుకు గోదావరి జలాలు వచ్చేశాయని అన్నారు. ఈ సందర్భంగా గోదావరి జలాలకు ఆయన పూజలు చేశారు.