రాధికా ఆప్టేకు లండన్ లో అభిమానుల తాకిడి!
- వెబ్ సిరీస్‌లలోనూ నటిస్తున్నాను
- దీంతో లండన్ ప్రజలు కూడా నన్ను గుర్తు పడుతున్నారు
- కొందరు అభిమానులు పేరు పెట్టి పిలుస్తూ గట్టిగా అరుస్తుంటారు
- వాకింగ్ చేస్తున్నప్పుడు దృష్టిని మరల్చే ప్రయత్నాలు చేస్తారు
అయితే, వారు తన దగ్గరికి వచ్చి అభినందించినప్పుడు మాత్రం అన్నీ మరచిపోతామని తెలిపింది. కొందరు అభిమానులు మాత్రం తమ తీరుతో విసుగుతెప్పిస్తుంటారని, పేరు పెట్టి పిలుస్తూ గట్టిగా అరుస్తుంటారని, వాకింగ్ చేస్తున్నప్పుడు తన దృష్టిని మరల్చే ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపింది.
తాను ఓ సారి విమాన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకరు తన వద్దకు వచ్చి సెల్ఫీ అడిగారని, అయితే, అప్పటికే అలసిపోవడంతో ఇవ్వలేదని రాధికా ఆప్టే చెప్పింది. అయితే, పడుకొని లేచిన తర్వాత కూడా అదే వ్యక్తి సెల్ఫీ కోసం తన వద్దకు వచ్చాడని, అది చూసి ఆశ్చర్యపోయానని గుర్తు చేసుకుంది.