పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు కరోనా.. నవదంపతుల సహా మొత్తం క్వారంటైన్‌లోకి!

Cooking master infected to corona officers send whole family to quarantine
  • కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో ఘటన
  • ఈ నెల 14న కరోనా బారినపడిన వంట మాస్టర్
  • కొత్త దంపతులు సహా 56 మందిని క్వారంటైన్‌కు పంపిన అధికారులు
పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌కు వైరస్ సోకడంతో కొత్త జంట సహా వారి కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైనవారు అందరినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జరిగిందీ ఘటన.

అధికారుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు.  

Go Back to Shorts
Karnataka
Tumkur
marriage
Quarantine Centre

More Telugu News