టీడీపీ హయాంలో కేంద్రీకృత అవినీతి వుంటే, ఇప్పుడది వికేంద్రీకరణ అయింది!: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy comments on AP situations
  • రాయలసీమ జన్ సంవాద్ వర్చువల్ సభలో పాల్గొన్న మంత్రి 
  • జగన్ ది అహంకార ప్రభుత్వమంటూ విమర్శలు 
  • ఏపీలో అక్రమకేసులపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాయలసీమ జన్ సంవాద్ వర్చువల్ సభలో పాల్గొన్న సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుది అవినీతి ప్రభుత్వం అని, జగన్ ది అహంకార ప్రభుత్వం అని విమర్శించారు. టీడీపీ హయాంలో కేంద్రీకృత అవినీతి ఉండేదని, ఇప్పుడది వికేంద్రీకరణ అయిందని అభివర్ణించారు. నాడు అవినీతి రాజ్యమేలితే, నేడు పోలీసుల రాజ్యంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీలో అక్రమకేసులపై తనకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని, ఏపీలో పార్టీ మారితే కష్టం, సభలో పాల్గొంటే కష్టం అనేలా పరిస్థితి తయారైందని అన్నారు.
Go Back to Shorts
Kishan Reddy
Andhra Pradesh
Police Cases
Chandrababu
Jagan

More Telugu News