జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ స్వైరవిహారం... ఒక్కరోజులో 713 కేసులు
- రంగారెడ్డి జిల్లాలో మరో 107 మందికి కరోనా
- తెలంగాణలో 24 గంటల్లో 872 కొత్త కేసులు
- మరో ఏడుగురి మృతి
- 217కి చేరిన కరోనా మరణాలు
ఇక, తెలంగాణ వ్యాప్తంగా 872 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 8,674కి పెరిగింది. తాజాగా 274 మంది డిశ్చార్జి అయ్యారు. ఓవరాల్ గా 4,005 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 4,452 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరో 7 గురు మరణించడంతో కరోనా మృతుల సంఖ్య 217కి చేరింది.