బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కుటుంబ సభ్యులకు నెగెటివ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కుటుంబ సభ్యులకు నెగెటివ్

BJP MLA Raja Singh tests corona negetive
  • రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ 
  • హోం క్వారంటైన్ లో రాజాసింగ్
  • రాముడు, గోమాత దయతో నెగెటివ్ వచ్చిందన్న రాజాసింగ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలింది. ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులకు కూడా నెగెటివ్ అని నిర్ధారణ అయింది. రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. దీంతో, అందరూ ఆందోళనకు గురయ్యారు. రాజాసింగ్ కుటుంబం హోం క్వారంటైన్ అయింది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ తో పాటు ఆయన కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో నెగెటివ్ అని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా రాజాసింగ్ స్పందిస్తూ... శ్రీరాముడు, గోమాత దయతో తనకు, తన కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని చెప్పారు. తన క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు.
Raja Singh
Bjp
Corona Virus

More Telugu News