India: దేశంలో ఒక్కరోజులో 14,821 మందికి సోకిన కరోనా

445 deaths in India in 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 14,821 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 445 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,25,282కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 13,699కి పెరిగింది. 1,74,387 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,37,196 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
India
Corona Virus
COVID-19

More Telugu News