చిరంజీవికి హెయిర్ కట్ చేసిన కుమార్తె... ఫాదర్స్ డే స్పెషల్ వీడియో
- కుమార్తెతో హెయిర్ కట్ చేయించుకున్న చిరు
- ఇంట్లోంచి బయటికి రాలేకపోతుంటే ఇంకేం చేయాలన్న సుస్మిత
- మాకు మేమే సాయం చేసుకుంటున్నామన్న చిరంజీవి
లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటికి రాలేకపోతున్నాం... అందుకే మాకు మేమే ఇలా సాయం చేసుకుంటున్నాం అంటూ తండ్రీతనయ వ్యాఖ్యానించారు. థాంక్యూ నాన్నా. ఇప్పటివరకు ఎంతో ప్రేమను పంచావు. ఈ సాధారణ హెయిర్ కట్ నుంచి జీవితంలోని పెద్ద పెద్ద విషయాల వరకు ప్రతి దాంట్లో నాపై నమ్మకం ఉంచుతూ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపావు. తండ్రి అంటే అదేనమో! హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా అంటూ సుస్మిత స్పందించారు.