Corona Virus: ఏపీలో మరో 439 మందికి సోకిన కరోనా

coronavirus cases in ap
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,059 అని పేర్కొంది. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 3,599 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 106 కి చేరింది.      

                   
Go Back to Shorts
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News