సానియా మీర్జాను కలిసేందుకు షోయబ్ మాలిక్‌కు పీసీబీ అనుమతి
- ఐదు నెలలుగా కుటుంబానికి దూరమైన షోయబ్
- మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామన్న పీసీబీ
- జులై 24న ఇండియాకు రాక
ఆగస్టు-సెప్టెంబరులో పాకిస్థాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఆతిథ్య జట్టుతో మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న పాక్ జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లనుంది. డెర్బీషైర్‌లో 14 రోజులపాటు నిర్బంధంలో ఉన్న అనంతరం కోవిడ్ నిబంధనలను అనుసరించి క్రికెట్ ఆడే విధానంపై పాక్ జట్టు శిక్షణ పొందనుంది. అనంతరం బయో సురక్షిత వాతావరణంలో నిబంధనల మేరకు క్రికెట్ మ్యాచ్‌లు జరగనున్నాయి.