Corona Virus: దేశంలో విపరీతంగా పెరిగిపోతోన్న కేసులు.. ఒక్కరోజులో 15,413 మందికి కరోనా సోకిన వైనం

15413 coronavirus cases in India in 24 hours
షార్ట్స్‌లో చూడండి
భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 15,413 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 306 మంది మరణించారు.
     
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 4,10,461కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  13,254కి  పెరిగింది. 1,69,451 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు  2,27,756 మంది కోలుకున్నారు.
Go Back to Shorts
Corona Virus
COVID-19
India

More Telugu News