ఎయిమ్స్ పీజీ టెస్ట్ లో టాపర్ గా గుంటూరు యువతి వినీతా కన్నెగంటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎయిమ్స్ పీజీ టెస్ట్ లో టాపర్ గా గుంటూరు యువతి వినీతా కన్నెగంటి!

Vineetha Kanneganti Scured top Rank in AIIMS PG Entrance
  • భువనేశ్వర్ ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ చదివిన వినీత
  • జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో నూటికి నూరు మార్కులు
  • 100 లోపు ర్యాంకులలో ఎయిమ్స్ విద్యార్థులు 29 మంది
  • జనరల్ మెడిసిన్ ను ఎంచుకుంటానన్న వినీత
న్యూఢిల్లీలోని ఎయిమ్స్ నిర్వహించిన పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ లో గుంటూరుకు చెందిన డాక్టర్ వినీతా కన్నెగంటి టాపర్ గా నిలిచారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో వైద్య విద్యను అభ్యసించిన వినీత, జూన్ 11న నిర్వహించిన పరీక్షల్లో తొలి స్థానంలో నిలిచారు. వినీతతో పాటు భువనేశ్వర్ ఎయిమ్స్ కు చెందిన మొత్తం ఆరుగురు వంద లోపు ర్యాంకులలో నిలవడం విశేషం.

ఈ ప్రతిష్ఠాత్మక పరీక్షల్లో టాపర్ గా నిలిచిన తరువాత వినీత మాట్లాడుతూ, తాను పీజీలో జనరల్ మెడిసిన్ ను ఎంచుకోనున్నానని, గత సంవత్సరం డిసెంబర్ లోనే తన ఎంబీబీఎస్ పూర్తయిందని తెలిపారు. ఈ పరీక్షల కోసం కష్టపడ్డానని, ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. తన పీజీ విద్యను ఢిల్లీ ఎయిమ్స్ లేదా చండీగఢ్ లోని మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో గానీ పూర్తి చేస్తానని ఆమె అంటున్నారు.

"పీజీలో ప్రవేశం కోసం ఆరు నెలల క్రితమే ప్రిపరేషన్ ను మొదలు పెట్టాను. ఎంబీబీఎస్ కోర్స్ లోని స్టడీ మెటీరియల్స్ ను మరోసారి చదువుకున్నాను. ఓ యాప్ ద్వారా ఆన్ లైన్ క్లాసులు తీసుకుని పరీక్షకు హాజరయ్యాను" అని ఆమె వెల్లడించారు. కాగా, పీజీ ఎంట్రెన్స్ లో మొత్తం 4,335 మంది ర్యాంకులను అందుకున్నారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో చదువుతున్న 74 మందికి ర్యాంకులు లభించాయి.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిమ్స్ ల్లో చదువుతున్న 29 మందికి వందలోపు ర్యాంకులు వచ్చాయి. జోధ్ పూర్, రుషీకేశ్ ఎయిమ్స్ లకు చెందిన ఆరుగురికి, భోపాల్ ఎయిమ్స్ కు చెందిన ఐదుగురికి, న్యూఢిల్లీ ఎయిమ్స్ లో చదివిన నలుగురికి కూడా 100 పర్సంటైల్ లభించింది.
AIIMS
PG Entrance
Vineetha Kanneganti
Topper

More Telugu News