భారత సరిహద్దులో ఫొటోలు తీస్తున్న పాక్ రహస్య డ్రోన్.. కూల్చేసిన బీఎస్ఎఫ్

Pakistani spy drone was shot down by Border Security Force
  • సరిహద్దులో ఫొటోలు తీస్తున్న డ్రోన్
  • 8 రౌండ్ల కాల్పులు జరిపిన బీఎస్ఎఫ్
  • పాకిస్థానే పంపించిందంటున్న అధికారులు
భారత సరిహద్దులో అనుమానాస్పదంగా తిరుగుతున్న పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు కూల్చివేశాయి. జమ్ముూకశ్మీర్‌లోని కథువా జిల్లా హీరానగర్ సెక్టార్, రథువా వద్ద ఈ ఉదయం పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్ ఎగురుతూ కనిపించింది. రహస్యంగా అది ఫొటోలు తీస్తున్నట్టు గుర్తించిన బీఎస్ఎఫ్ 19 బెటాలియన్ జవాన్లు దానిపై 8 రౌండ్ల కాల్పులు జరిపి కూల్చివేశారు. సరిహద్దులో రహస్యంగా ఫొటోలు చిత్రీకరించేందుకే పాక్ దానిని పంపించి ఉంటుందని అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

Go Back to Shorts
Pakistan
Drone
BSF
Jammu And Kashmir

More Telugu News