పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నవదంపతుల దుర్మరణం
- ఈ నెల 14న గుంటూరు జిల్లా గోవాడలో వివాహం
- భార్యతో కలిసి కారులో సబ్బవరానికి బయలుదేరిన భర్త
- ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం
అదే సమయంలో ఏలూరు వైపు వెళ్తున్న లారీ వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్, మానస నవ్య, భరత్, కారు డ్రైవర్ చంద్రశేఖర్ (64) తీవ్రంగా గాయపడ్డారు. అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్ చరణ్ స్థానికుల సాయంతో క్షతగాత్రులను తన వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే వెంకటేశ్, నవ్య, చంద్రశేఖర్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్రంగా గాయపడిన భరత్ చికిత్స పొందుతున్నాడు. వివాహమై వారం రోజులు కూడా కాకముందే ఇద్దరూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఇరు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది.