ఏపీ, టీఎస్ మధ్య బస్సు సర్వీసులు... కండిషన్ పెట్టిన తెలంగాణ!
- ఏపీ, టీఎస్ మధ్య ఇంకా ప్రారంభంకాని బస్సు సర్వీసులు
- రెండు రాష్ట్రాల బస్సు సర్వీసులు సమానంగా ఉండాలంటున్న తెలంగాణ
- ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య కొనసాగుతున్న చర్చలు
ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు తెలంగాణ కూడా సుముఖంగానే ఉంది. అయితే ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు సమాన సంఖ్యలో ఉండాలని కండిషన్ పెట్టింది. ఇదే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దీనిపై క్లారిటీ వచ్చిన వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభంకానున్నాయి.