సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- షూటింగ్ అంటే భయపడుతున్న నాయిక
- ఫాలోవర్స్ కి థ్యాంక్స్ చెప్పిన నాగార్జున
- కమల్ సీక్వెల్ కి స్క్రిప్టు సిద్ధం
* అక్కినేని నాగార్జునకు ఇప్పటికీ అభిమానులు చెక్కుచెదరలేదని సోషల్ మీడియా మరోసారి నిరూపించింది. తాజాగా ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో 60 లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
* గతంలో కమలహాసన్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన 'వెట్టియాడు విలైయాడు' (తెలుగులో రాఘవన్) చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నంలో భాగంగా గౌతమ్ మీనన్ స్క్రిప్టును సిద్ధం చేశాడట. కమల్ ఓకే చెబితే, ఇక సెట్స్ కి వెళుతుంది.