సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- పారితోషికం తగ్గించుకుంటున్న కీర్తి సురేశ్
- త్వరలో 'పుష్ప' షెడ్యూల్ ప్రారంభం
- ఆగస్టు నుంచి షూటింగులకి నితిన్
* అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప' చిత్రం షూటింగును ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో వేస్తున్న భారీ సెట్స్ లో ఈ చిత్రం షూటింగును త్వరలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా నటిస్తోంది.
* యంగ్ హీరో నితిన్ ఆగస్టు నుంచి షూటింగులలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడని సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న 'రంగ్ దే' చిత్రం షూటింగులో ఆగస్టులో జాయిన్ అవుతాడట.