రాళ్లతో దాడి చేసుకున్నారు... ముగ్గురు చైనా సైనికులు కూడా చనిపోయారు: భారత ఆర్మీ
- లడఖ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
- గతరాత్రి గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల ఘర్షణ
- ముగ్గురు భారత సైనిక సిబ్బంది మృతి
- చైనా సైనికులే రెచ్చగొట్టారన్న భారత సైన్యం
గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది.