ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం: నల్లచొక్కాలతో అసెంబ్లీకి వచ్చిన టీడీపీ సభ్యులు
- ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రశ్నిస్తాం
- ఏపీలో ల్యాండ్, శాండ్ మాఫియాలపై నిలదీస్తాం
- బడ్జెట్‌ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశాలు
గతంలో అడ్డుకున్న బిల్లులను మరోసారి ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఏపీలో ల్యాండ్, శాండ్ మాఫియాలపై నిలదీస్తామని తెలిపారు. కేవలం బడ్జెట్‌ను ఆమోదించుకోవడం కోసమే ఈ సమావేశాలు జరపాలని ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోందని అన్నారు.
ఏడాది కాలంలో రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ముందుకు కదలలేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన కందిపప్పును కూడా కొనుగోలు చేయలేకపోతోందని చెప్పారు.