Sushant Singh Rajput: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వదిన హఠాన్మరణం!

Another Tragedy in Sushant Singh Family
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు జరిగి 24 గంటలు కాకముందే, వారింట్లో మరో విషాదం నెలకొంది. సుశాంత్ వదిన (సుశాంత్ కజిన్ భార్య) సుధా దేవి బీహార్ లోని పుర్నియాలో తుది శ్వాస విడిచారు.

ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. తననెంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని, సుశాంత్ మరణ వార్త విన్న తరువాత ఆమె ఆహారం తీసుకోవడం మానేసిందని 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, సుశాంత్ అంత్యక్రియలు సోమవారం నాడు ముంబయిలోని విల్లే పార్లే పరిధిలో ఉన్న పవన్ హాన్స్ శ్మశానవాటికలో నిర్వహించారు.
Go Back to Shorts
Sushant Singh Rajput
Sister-in-Law
Died

More Telugu News