రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... నల్లచొక్కాలతో హాజరుకావాలని టీడీపీ నిర్ణయం
- గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్న సమావేశాలు
- అక్రమ అరెస్ట్ లపై నిలదీయాలని భావిస్తున్న టీడీపీ
- సభ్యులందరికీ కరోనా పరీక్షలు
కాగా, అసెంబ్లీ సమావేశాలు రేపు ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం కానున్నాయి. దేశంలోనే తొలిసారిగా గవర్నర్ ఆన్ లైన్ లో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఎన్నిరోజులు సభ జరపాలన్నది బీఏసీ నిర్ణయించనుంది. రేపటి సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అలాగే, ఏపీలో జరుగుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను సభలో బలంగా వినిపించాలని వైసీపీ సభ్యులు నిశ్చయించుకున్నారు. ఇక కరోనా నేపథ్యంలో, అసెంబ్లీకి వచ్చే ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత కరోనా టెస్టులు చేయించుకున్నారు.