మల్టీస్టారర్ కి ఓకే చెప్పిన రవితేజ!
- తెలుగులో మరో మలయాళ రీమేక్
- రవితేజ, రానా కలసి మల్టీస్టారర్
- ఆగస్టు నుంచి షూటింగుకి ఏర్పాట్లు
- దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు ప్రచారం
ఇటీవలి కాలంలో మలయాళంలో మంచి హిట్ సినిమాగా పేరుతెచ్చుకున్న 'అయ్యప్పనుమ్ కోషియం' చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో నటించిన బిజూ మీనన్, పృథ్వీ రాజ్ ల పాత్రలను తెలుగులో రవితేజ, రానా చేయనున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇందుకు డేట్స్ కూడా కేటాయించినట్టు చెబుతున్నారు. దీంతో షూటింగును ఆగష్టులో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎటొచ్చీ దర్శకుడి ఎంపికే ఇంకా పూర్తికాలేదు. అయితే, దర్శకుడిగా హరీశ్ శంకర్ పేరు మాత్రం బాగా వినిపిస్తోంది.