Atchannaidu: అచ్చెన్నాయుడు రిమాండ్ రిపోర్ట్ లో ఏముందంటే..?

Details of Atchannaidu remand report
షార్ట్స్‌లో చూడండి
ఈఎస్ఐ స్కాంకు సంబంధించిన కేసులో టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు 14 రోజుల రిమాండ్ ను ఏసీబీ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. రిమాండ్ రిపోర్టులో ఉన్న వివరాలు ఇవే.

"నిబంధనలను పాటించకుండానే టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇచ్చారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదు. బడ్జెట్ ఆమోదం కూడా లేదు. కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు గత అనుభవం కూడా లేదు. టెండర్లను పిలవకపోవడానికి గల కారణాలను కూడా చూపలేదు. టెలీ హెల్త్ సర్వీసులకు కాంట్రాక్టులు ఇవ్వాలని అచ్చెన్నాయుడు మూడు సార్లు ఒత్తిడి చేశారు. ఆయన ఒత్తిడి మేరకే కాంట్రాక్టులు ఇచ్చారు.

అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రూ. 4.15 కోట్లను విడుదల చేశామని ఈఎస్ఐ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ కుమార్ తెలిపారు. అచ్చెన్నాయుడుకు చాలా పలుకుబడి ఉంది. ఈ కేసులో చాలా మందిని విచారించాల్సి ఉంది. సాక్ష్యాలను, డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉంది.

కేసులో మొదటి నిందితుడు డాక్టర్ రమేశ్, రెండో నిందితుడు అచ్చెన్నాయుడు, మూడో నిందితుడు టెలీహెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ప్రమోద్ రెడ్డి. వీరికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలి. అచ్చెన్నాయుడుపై ఐపీసీ 409, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదైంది". ఈ వివరాలను రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది.
Go Back to Shorts
Atchannaidu
Telugudesam
Remand Report
ACB

More Telugu News