జగన్ శాడిజానికి ఇది పరాకాష్ఠ: నిప్పులు చెరిగిన చంద్రబాబు
- మచ్చలేని కుటుంబం అచ్చెన్నాయుడిది
- చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేశారు
- ఇది కక్షపూరిత చర్యేనన్న చంద్రబాబు
బలహీన వర్గాలను అణచి వేయడమే లక్ష్యంగా జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ఆయన ప్రోద్బలంతోనే ఏసీబీ దాడులు జరిగాయని చంద్రబాబు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారని, గత 38 సంవత్సరాలుగా ఆయన తనకు తెలుసునని, వారిది మచ్చలేని కుటుంబమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడికి ఏదైనా హాని జరిగితే, ప్రభుత్వానిదే బాధ్యతని హెచ్చరించారు. ఇది కచ్చితంగా కక్షపూరిత చర్యేనని, లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో, వందలాది మంది పోలీసులను పంపించి, ఈ తరహాలో అరెస్ట్ కు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.