తెలంగాణలో కరోనా ఉద్ధృతి... 209 కొత్త కేసులు, 9 మరణాలు
- రాష్ట్రంలో 165కి చేరిన మృతుల సంఖ్య
- జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 175 మందికి కరోనా
- రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,320
తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 175 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంతేకాదు, రాష్ట్రంలో మరో 9 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు 165 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. కాగా, రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,320కి చేరింది. 1,993 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా, 2,162 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.