బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పై కరోనా పంజా
- పీఎస్ లో పని చేస్తున్న ఏడుగురు పోలీసులకు పాజిటివ్
- షాక్ కు గురైన పోలీస్ శాఖ
- ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులంతా క్వారంటైన్ కు తరలింపు
తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, పోలీస్ శాఖ షాక్ కు గురైంది. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం వారి ప్రైమరీ కాంటాక్ట్ వివరాలను సేకరించి... అందరినీ క్వారంటైన్ కు తరలించారు. వారందరి శాంపిళ్లను సేకరించి, కరోనా టెస్టులు చేస్తున్నారు.