సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సోషల్ మీడియాలో అనుష్క కొత్త రికార్డు
- హిందీలో పూరి మరో రెండు సినిమాలు
- మహేశ్ కు విలన్ గా కన్నడ స్టార్
* పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమాను చేస్తున్న సంగతి విదితమే. దీని తర్వాత హిందీలో ఇద్దరు స్టార్ హీరోలతో మరో రెండు సినిమాలు చేస్తాడట. కరణ్ జొహార్ తో కలసి ఈ చిత్రాలను ప్లాన్ చేస్తున్నాడు.
* మహేశ్ హీరోగా పరశురాం దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో విలన్ పాత్రకు గాను కన్నడ స్టార్ సుధీర్ ను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్ నుంచి జరుగుతుంది.