KTR: నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుంది: కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్

Congress has done nothing to farmers says KTR
షార్ట్స్‌లో చూడండి
టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. కాంగ్రెస్ నాయకులు వ్యవహరిస్తున్న తీరు నక్కలన్నీ కలిసి సంతాప సభ పెట్టినట్టుందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు జల దీక్షలు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. ఎన్నో ఏళ్లు పాలించి కాంగ్రెస్ నేతలు చేసిందేముందని... అసలు వాళ్లకు సిగ్గుందా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ పాలన చూసి కాంగ్రెస్ నేతలు ఈర్ష్య పడుతున్నారని, వారి కళ్లు ఎర్రబడుతున్నాయని కేటీఆర్ అన్నారు. ఆరేళ్లలో కేసీఆర్ ఏం చేశారో కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రైతులను రాబందుల్లా పీక్కుతిన్న చరిత్ర కాంగ్రెస్ నాయకులదని అన్నారు. కేసీఆర్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గోదావరి నీటితో చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు.
Go Back to Shorts
KTR
KCR
TRS
Congress

More Telugu News