నేడు కూడా స్వల్పంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు

Petrol price hiked
  • పెట్రోల్‌పై దాదాపు 40 పైసల పెరుగుదల
  • డీజిల్‌పై 45 పైసలు
  • ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.73.40
  • డీజిల్‌ ధర రూ.71.62
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరసగా నాలుగో రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశ వ్యాప్తంగా పెట్రోల్‌పై దాదాపు 40, డీజిల్‌పై 45 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో నిన్న లీటరు పెట్రోల్ ధర రూ.73గా ఉండగా ఈ రోజు రూ.73.40గా ఉంది. డీజిల్‌ ధర నిన్న రూ.71.17గా ఉండగా ఈ రోజు రూ.71.62కి చేరింది.

ఇక ముంబయిలో లీటరు పెట్రోలు ధర నిన్న రూ.80.01గా ఉండగా, ఈ రోజుగా 80.40కి చేరగా, లీటరు డీజిల్ ధర నిన్న రూ.69.92గా 70.35కికి చేరింది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.77.43, డీజిల్ ధర రూ70.13గా ఉంది.
Go Back to Shorts
Petrol
India
New Delhi

More Telugu News