మద్యంపై విధించిన 70 శాతం సెస్‌ను ఉపసంహరించుకున్న ఢిల్లీ ప్రభుత్వం
- లాక్డౌన్ మూడో విడతలో మద్యం దుకాణాలకు అనుమతి
- వ్యాట్‌ను మరో ఐదు శాతం పెంచి 25 శాతం చేసిన ప్రభుత్వం
- కరోనా సెస్ ఉపసంహరణతో భారీగా దిగి రానున్న మద్యం ధరలు
అయితే, విపరీతమైన రద్దీ కారణంగా సామాజిక దూరం గాలికి ఎగిరిపోయింది. దీంతో రద్దీని తగ్గించి సామాజిక దూరం అమలయ్యేలా చూసేందుకు మద్యంపై 70 శాతం కరోనా సెస్ విధించింది. తాజాగా, ఇప్పుడీ సెస్‌ను ఉపసంహరించుకున్న ప్రభుత్వం వ్యాట్‌ను మరో ఐదుశాతం పెంచి 25 శాతం చేసింది. సెస్ ఉపసంహరణతో మద్యం ధరలు భారీగా దిగి రానున్నాయి.