Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా... భక్తుల్ని అనుమతించాలన్న నిర్ణయం వాయిదా

Srikalahasti priest tested corona positive
  • మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి కరోనా పరీక్షలు
  • మరికొందరి రిపోర్టుల కోసం వేచిచూస్తున్న అధికారులు
  • ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు భక్తులకు ప్రవేశం లేదన్న ఈవో
ముక్కంటి కొలువై ఉన్న శ్రీకాళహస్తి ఆలయంలో దర్శనాలకు అంతా సిద్ధమైన తరుణంలో ఓ అర్చకుడు కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. మొత్తం 71 మంది ఆలయ సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఒక అర్చకుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇంకా మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. దాంతో ఈ నెల 12 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా వేశారు. దీనిపై ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు శ్రీకాళహస్తి ఆలయంలోకి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
Srikalahasti
Temple
Priest
Corona Virus
Positive

More Telugu News