లాక్ డౌన్ టైమ్ లో కొత్తకొత్త ఆలోచనలు వస్తున్నాయి: రాధికా ఆప్టే
- లాక్ డౌన్ ను చాలా ఆస్వాదిస్తున్నా
- ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా పని చేశాను
- రెస్టారెంట్ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన వస్తోంది
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, విరామం లేకుండా గత ఎనిమిదేళ్లుగా పని చేస్తూనే ఉన్నానని రాధిక తెలిపింది. ఇప్పుడు తనకు విరామం దొరికిందని చెప్పింది. స్వయంగా తానే కొన్ని కథలు రెడీ చేసుకుంటున్నానని తెలిపింది. భవిష్యత్తు గురించి తాను ఎక్కువగా ఆలోచించనని... ఎందుకంటే జీవితంలో అసంతృప్తి ఎక్కువైతే సంతోషం దూరమవుతుందని చెప్పింది. ఆనందంగా జీవితాన్ని గడపడమే తనకు ముఖ్యమని తెలిపింది. లాక్ డౌన్ సమయంలో ప్రశాంతంగా ఆలోచిస్తుంటే రకరకాల ఆలోచనలు వస్తున్నాయని చెప్పింది. సినిమా కెరీర్ ను పూర్తిగా పక్కన పెట్టేసి, రెస్టారెంట్ బిజినెస్ ను ప్రారంభిస్తే ఎలాగుంటుందనే ఆలోచన కూడా వచ్చిందని తెలిపింది.