16 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు, 18న బడ్జెట్!

Andhrapradesh Assembly Session From 16
  • 16న గవర్నర్ ప్రసంగం
  • 19న రాజ్యసభ ఎన్నికలు
  • తక్కువ రోజులు జరగనున్న అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి.  ఈ సంవత్సరం మార్చిలో ఓటాన్‌ అకౌంట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఈ దఫా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. 16వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సభ ప్రారంభం అవుతుందని తెలుస్తుండగా, 18న బడ్జెట్ సభ ముందుకు రానుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.

సమావేశాలు ప్రారంభమయ్యే తొలి రోజే గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం ముగియగానే, బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశమై. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనుంది. ఆపై 19 వ తేదీన ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కరోనా విస్తరణ నేపథ్యంలో సాధ్యమైనన్ని తక్కువ రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలను ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Andhra Pradesh
AP Assembly Session
Budget

More Telugu News