కర్నూలులో దారుణం.. తమ్ముడి భార్యను దారుణంగా చంపేసిన వ్యక్తి
- ఇంటి స్థల వివాదమే కారణం
- తమ్ముడి భార్యతో గొడవ పెట్టుకున్న వ్యక్తి
- కోపంతో ఊగిపోతూ గొడ్డలితో దాడి
ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం పెరిగి ఆగ్రహంతో ఊగిపోతూ ఆమె మెడపై ఏసన్న గొడ్డలితో దాడి చేశాడు. దీంతో ఆమె రక్తపు మడుగులో అక్కడే పడిపోయింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా అంబులెన్సులోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.