ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదాకు మరో ఎదురుదెబ్బ.. ఉత్తర ఆఫ్రికా చీఫ్ అబ్దుల్ మాలిక్ హతం
- ఏడేళ్లుగా వెతుకుతున్న ఫ్రెంచ్ సైన్యం
- పక్కా సమాచారంతో మట్టుబెట్టిన వైనం
- మాలి సైన్యంతో కలిసి ఏకకాలంలో దాడులు
నార్త్ అల్జీరియాలోని పర్వత సానువుల్లో మాలిక్ తలదాచుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న ఫ్రెంచ్ సైన్యం, స్థానిక సైన్యంతో కలిసి దాడి చేసింది. ఉత్తర మాలి, అల్జీరియా ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన ఈ దాడుల్లో మాలిక్ మరణించాడు. మాలిక్ మృతిని ధ్రువీకరిస్తూ ఫ్రాన్స్ ప్రకటన విడుదల చేసింది.