తెలంగాణలో కరోనా అప్ డేట్... మరో ఎనిమిది మంది మృతి

Eight more people died in Telangana
  • 113కి పెరిగిన మరణాల సంఖ్య
  • గత 24 గంటల్లో 143 మందికి కరోనా పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 116 మందికి కరోనా నిర్ధారణ
తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8 మంది మృతి చెందినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. దాంతో మరణాల సంఖ్య 113కి పెరిగింది. ఈ మేరకు బులెటిన్ లో పేర్కొన్నారు. కొత్తగా 143 మందికి కరోనా నిర్ధారణ కాగా, అవన్నీ లోకల్ కేసులేనని గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 116 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా, ఇప్పటివరకు తెలంగాణలో 3,290 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,627 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 1,550 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బయటి నుంచి వచ్చిన వారిలో కొత్త కేసులేమీ నమోదు కాదు.
Go Back to Shorts
Telangana
Deaths
Corona Virus
Positive
GHMC
Hyderabad
COVID-19

More Telugu News