పట్టించుకోనవసరం లేని వారి కోసం పోరాటాలు చేసి చంద్రబాబు పరువు తీసుకుంటున్నారు: విజయసాయిరెడ్డి
- పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది
- చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదు
- తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే బాగుండేది
- ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది
'పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు' అని ఆయన ట్వీట్ చేశారు.