పట్టించుకోనవసరం లేని వారి కోసం పోరాటాలు చేసి చంద్రబాబు పరువు తీసుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది
  • చంద్రబాబు ఒక్క మాట మాట్లాడలేదు
  • తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే బాగుండేది
  • ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పోతిరెడ్డిపాడుపై న్యాయపోరాటం చేస్తామని ప్రకటించని చంద్రబాబు అనవసర విషయాలపై మాత్రం ప్రకటనలు చేస్తున్నారని ఆయన అన్నారు.

'పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు' అని ఆయన ట్వీట్ చేశారు.

Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News