ఫ్యాన్స్ కు షాకిస్తూ పెళ్లి ఫోటో... ఆ వెంటనే తండ్రిని కాబోతున్నానని ప్రకటించిన హార్దిక్ పాండ్యా!
- జనవరి 1న సెర్బియా నటి నటాషాతో నిశ్చితార్థం
- జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టనున్నాం
- ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించిన హార్దిక్ పాండ్యా
"మేం కొత్త జీవితానికి స్వాగతం పలకనున్నాం. అందుకోసం మేమిద్దరం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. కొత్త దశలోకి అడుగు పెడుతూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం, దీవెనలు నాకు కావాలి. నటాషాతో నా ప్రయాణం గొప్పగా ఉంటుంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుందని నమ్ముతున్నా" అని చెప్పాడు. హార్దిక్ కు ఇప్పుడు ఇతర క్రికెటర్లు, ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి.