నిమ్మగడ్డ కేసులో మరో ట్విస్ట్.. బాధ్యతలు స్వీకరించినట్టు ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి
- హైకోర్టు తీర్పుతో బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఉత్తర్వులు
- తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామన్న ఏజీ
- ఆ తర్వాత కాసేపటికే ఉపసంహరణ ఉత్తర్వులు
అంతకుముందు ఏజీ ఎస్.శ్రీరాం మాట్లాడుతూ నిమ్మగడ్డ స్వీయ పునరుద్ధరణ చెల్లదని అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే ఎస్ఈసీ కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ నుంచి మరో సర్క్యులర్ వెలువడింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎస్ఈసీగా మళ్లీ బాధ్యతలు స్వీకరించినట్టు జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇదే స్థితి కొనసాగుతుందని పేర్కొనడం గమనార్హం.